A man named Onteru Nagaraju was kidnapped in Palnadu district: పల్నాడులో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. తాజాగా వైసీపీ నేత కిడ్నాప్ అయ్యాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద వైసీపీకి చెందిన ఒంటేరు నాగరాజు అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు.

దుర్గి మండలం జంగమేశ్వర పాడుకు చెందిన వాడు ఈ వైసీపీ నేత ఒంటేరు నాగరాజు. అయితే…. ఎన్నికల తర్వాత వినుకొండ మండలం వెంకుపాలెంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవన సాగిస్తున్నాడు నాగరాజు. ఇక గురువారం అంటే ఇవాళ నాగరాజు ఆచూకీ కనిపెట్టి.. బొలెరో వాహనంలో కిడ్నాప్ చేశారు ప్రత్యర్థులు. అడ్డుకున్న వారిని గాయపరిచి నాగరాజును కిడ్నాప్ చేశారట ప్రత్యర్థులు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.