ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్. ఏపీలో ఇవాల్టి నుంచి ఆసుపత్రిలో ఓపి సేవలు నిలిపివేయబడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ వైద్య విద్యలో ఇన్సర్విస్ కోటాను తగ్గించడానికి వ్యతిరేకిస్తూ… పిహెచ్సి వైద్యులు ఆసుపత్రులలో ఓపి సేవలను.. బహిష్కరించబోతున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పిహెచ్సి వైద్యుల సంఘం సభ్యులు.
నిన్న ఇదే విషయంపై ఏపీ సర్కార్ పెద్దలతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయని వైద్యుల సంఘం వెల్లడించింది. దీంతో ఇవాల్టి నుంచి ఆసుపత్రిలో ఓపి సేవలు బంద్ కానున్నట్లు ప్రకటించింది. ఇక రేపు చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టనున్నట్టు వెల్లడించింది వైద్యుల సంఘం. సోమవారం రోజున హెల్త్ డైరెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని.. మంగళవారం రోజున నిరవధిక దీక్షలు చేస్తామని హెచ్చరించారు వైద్యుల సంఘం సభ్యులు. మరి దీనిపై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.