ఐపిఎస్ ఏబి వేంకటేశ్వరరావు కు జగన్ సర్కార్ పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడేళ్ళ తరువాత ఐపిఎస్ ఏబి వేంకటేశ్వరరావు కు ప్రింటింగ్, స్టేషనరీ, అండ్ స్టోర్స్ కమిషనర్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ముత్యాలంపాడు లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో బాధ్యతలు స్వీకరించారు ఏబి వెంకటేశ్వర రావు. ఈ సందర్భంగా ఏబి వేంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఇక్కడి స్థితిగతులు అధ్యయనం చేస్తానని పేర్కొన్నారు.
ఈ శాఖ పట్ల నాకు అవగాహణ లేదని.. అధికారులతో సమన్వయంతో పని చేస్తానని ప్రకటించారు. ముత్యాలం పాడు లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కు గతంలో కీర్తి ఉండేదని.. విభజన తరువాత మిగిలిన ఈ విభాగం లో ని స్థితి గతులను అధ్యానం చేస్తానని వెల్లడించారు ఏబి వేంకటేశ్వరరావు. గతంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ముద్రణ ఇక్కడ జరిగేవని.. ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు సిబ్బంది తో చర్చించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇది ప్రాధాన్యత లేని పోస్టింగ్ అని నేను భావించడంలేదని.. నిమకాల విషయం ప్రభుత్వం తన ఆలోచనల మేరకు ఆలోచిస్తుందని తెలిపారు ఏబి వేంకటేశ్వరరావు.