ఈవీఎం మొరాయించడంతో ఓటు వేయకుండా వెనుదిరిగిన మిజోరం సీఎం

-

మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 40 స్థానాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 8 లక్షలకు పైగా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరాల్సి వస్తోంది.

మిజోరం సీఎం, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) అధినేత జొరాంథంగా తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఈవీఎం మొరాయించడం వల్ల పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. టిఫిన్ చేసి మళ్లీ వస్తానంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లారు. మరోవైపు మిజోరం కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్​సవ్తా ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేశారు. అయిజాల్​లోని మిషన్ వెంగ్​త్లాంగ్​ పోలింగ్ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మిజోరం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news