BREAKING: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులోని 15వ మలుపు వద్ద డివైడర్ను ఢీకొట్టింది కారు. ఈ తరుణంలోనే… తమిళనాడుకు చెందిన భక్తులకు గాయాలు అయ్యారు. దీంతో బాధితులను తిరుపతి రుయాకి తరలించారు. ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి అందరూ ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల వర్షాలు పడటంతో.. రోడ్డు చిందర వందరగా ఉందని.. అందుకే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు అక్కడే ఉన్న భక్తులు. ఇది ఇలా ఉండగా.. తిరుమల లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుమల శ్రీ వారి సర్వ దర్శ నానికి 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు భక్తులు.
80,741 మంది భక్తులు..తిరుమలలో నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 31,581 మంది భక్తులు..తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా నమోదు అయింది.