ఉద్యోగ నేత సూర్యనారాయణ అరెస్టు జగన్ నిరంకుశ విధానాలకు పరాకాష్ట అని ఆగ్రహించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఉద్యోగుల పక్షాన పోరాడితే అవినీతి అంటగట్టి అక్రమ కేసులుపెట్టి అరెస్టు చేస్తారా? ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఏమైనా బానిసలా? వారు తమ హక్కుల కోసం పోరాడకూడదా..? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ఉద్యోగ నేతను ఉగ్రవాద నేతలా ప్రత్యేక పోలీస్ టీంలను పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గం అని.. సూర్యనారాయణ అరెస్టు ఉద్యోగుల పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వ విధానం ఏమిటో తెలియజేస్తుందని వెల్లడించారు.నిరంతరం సేవలందిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఉద్యోగులపై జగన్ రెడ్డి ప్రతాపం ఏమిటి? అని నిలదీశారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారిని కూడా జగన్ వదలడం లేదని.. జగన్ రెడ్డికి బాకా ఊదే నేతలకు అవార్డులు, రివార్డులు… నిబద్దతతో పోరాడే నేతలపై అక్రమ కేసులా? అని ప్రశ్నించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాబోయే ఎన్నికల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కుతో జగనుకి బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.