బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా..!

-

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని  చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈనెల 10న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈనెల 13కి విచారణను వాయిదా వేసింది. తాజాగా విచారణ చేపట్టి మరోసారి ఈనెల 17కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

- Advertisement -

సీఐడీ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 17 A  పుట్టక ముందే నేరం జరిగింది కాబట్టి స్కిల్ స్కామ్ కేసు చట్టసవరణ వర్తించదని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. 2018 జులైలో చట్టసవరణ జరిగింది. 2014, 15 కేసులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణించలేము కదా? 17 ఏ అనేది అవినీతికి రక్షణ కాకూడదు. అవినీతి పరులను రక్షించేందుకు 17 ఏ చట్టసవరణ పరికరం కాకూడదు. సెక్షన్ 19 మాదిరిగా 17 ఏ సంపూర్ణంగా కేసు నమోదు కు నిరోధం కల్పించలేదని తెలిపారు ముకుల్ రోహత్గీ.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...