విద్యుత్ ఉద్యోగుల ధర్నా వాయిదా

-

విద్యుత్ సంస్థల యాజమాన్యంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నిరవధిక సమ్మెకు, మహా ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 10వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది విద్యుత్ జేఏసీ. అలాగే విద్యుత్ సౌధా వద్ద మహాధర్నా చేపట్టాలని భావించారు విద్యుత్ ఉద్యోగులు. అయితే తాజాగా విజయవాడలో చేపట్టనున్న ఈ ధర్నాని వాయిదా వేసుకున్నారు. తాత్కాలికంగా ఈ ధర్నాని వాయిదా వేస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు.

నిరసనకు అవకాశం కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. 2022 పిఆర్సి ప్రకారం వేతనాలు సవరించకుండా పాత సిఫార్సులే అమలు చేస్తున్నారంటూ ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే సిపి కాంతి రానా ఈ ధర్నాకి అనుమతి లేదని చెప్పడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ధర్నాని వాయిదా వేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news