యువత చదువుకోవాలి.. శ్రీచరణ కమ్యూనికేషన్స్ సీఎండీ శ్రీనివాస్ గుప్త

-

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీచరణ కమ్యూనికేషన్స్ కార్యాలయంలో కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ బి. శ్రీనివాస్ గుప్త జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఎందరో మహానుభావులు స్వాతంత్య్రం కోసం పోరాడారు.  స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులను గుర్తు చేసుకున్నారు. దేశం కోసం పోరాడిన వారి త్యాగం చాలా గొప్పది అని సీఎండీ బి. శ్రీనివాస్ గుప్త కొనియాడారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధులను నేటి యువత ఆదర్శం తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాకుంటే భారతదేశం పరిస్థితి మరో విధంగా ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం యువత చదువుకోవాలని.. చదువును మించిన ఆస్తి ఏది లేదని పేర్కొన్నారు బి.శ్రీనివాస్ గుప్త.  ఈ జాతీయ జెండా  ఆవిష్కరణ కార్యక్రమానికి కాలనీవాసులతో పాటు శ్రీచరణ కమ్యూనికేషన్ సిబ్బంది, తదితరులు హాజరయ్యారు. 

Read more RELATED
Recommended to you

Latest news