అగ్రిగోల్డ్ బాధితులకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ !

అగ్రిగోల్డ్ బాధితులకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం వై యస్ జగన్ తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపే అక్టోబర్, 2019లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ప్రభుత్వమే సొమ్మును తిరిగి చెల్లించారు. మొదటి విడతలో పదివేల రూపాయలు అగ్రిగోల్డ్ పెట్టుబడి పెట్టి నష్టపోయిన 3,59,655 మంది డిపాజిటర్లకు రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించి చెల్లింపులు జరిపారు. అయితే మొత్తం పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించడం కోసం ప్రభుత్వం జీవో విడుదల చేశారు.

Agrigold Agents died With heart attack

అయితే తొలి విడత పదివేల పాయల నష్టపరిహారం కొద్ది మందికి అందలేదన్న విషయం జగన్ దృష్టికి వచ్చింది. గత అక్టోబర్లోనే అలా మిగిలిపోయిన పదివేల రూపాయల లోపు డిపాజిటర్లకు, ఇరవై వేల రూపాయల డిపాజిటర్లకు చెల్లింపులు జరిపేటప్పుడు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే దీనికి సంబందించి హైకోర్ట్ పరిధిలో కేస్ నడుస్తోంది. హైకోర్టు లో ఈ విషయం క్లియర్ అయ్యాక ఇరవై వేల రూపాయల డిపోజిట్ల పంపిణీకి విధివిధానాలు తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు చెల్లింపులు జరగని పదివేల రూపాయల డిపోజిటర్లకు కూడా చెల్లింపులు జరుగుతాయని ఏపీ సిఐడీ ఒక ప్రకటన విడుదల చేసింది.