తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్ టీకా..!

-

2021 తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఐసీఎంఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మూడు రకాల కోవిడ్ వ్యాక్సీన్ టీకాలకు మానవ ట్రయల్స్ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో విస్తృతంగా కరోనా టీకా తయారీ కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న టీకా ట్రయల్స్ వివరాల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌కు వెళ్లితే పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. దేశంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. పరీక్షల కోసం ముందుకొచ్చే ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని ఐసీఎంఆర్‌కు ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని, ఐసీఎంఆర్ వందేళ్ల టైమ్‌లైన్‌ను రిలీజ్ చేయడం గర్వంగా ఉందన్నారు. కరోనా టెస్టుల విషయంలో ఈ నూతన గైడ్‌లైన్స్ రాష్ట్రాలు సవరించుకోవచ్చునని స్పష్టం చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news