ఏలూరు వింత వ్యాధిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. అధికారులు, సంస్థలు, నిపుణులతో వర్చువల్ విధానంలో సమావేశం అయ్యారు. ఇక వింత వ్యాధిపై ఢిల్లీ ఎయిమ్స్ నివేదిక కూడా వచ్చేసింది. వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణం అని తేలింది. యిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే వి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని నిపుణులు పేర్కొన్నారు.
ఇక న్యూఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి ఈ బాధ్యతలు మరలా అప్పగించారు జగన్. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలన్న జగన్ ప్రతిజిల్లాలో కూడా ల్యాబులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎస్ ని ఆదేశించారు.