ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్.. వారందరికీ మరో ఛాన్స్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ దారులకు బిగ్ అలర్ట్. తాజాగా ఏపీ సర్కార్ పెన్షన్ల విషయంలో… కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తున్నది చంద్రబాబు సర్కార్. అయితే పెన్షన్ల ను బదిలీ చేసుకున్నందుకు వెసులుబాటు కల్పించింది చంద్రబాబు సర్కార్. కొంతమంది పింఛన్దారులు ఉపాధి లేక ఇతర కారణాల వల్ల… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఉంటున్నారు. మొదట ఇచ్చిన అడ్రస్ కంటే.. వేరే అడ్రస్ కు మారిపోయారు.

Chandrababu’s shock for pensioners in AP

అయితే వాళ్లు ఒకటో తారీకు వచ్చిందంటే… మొదట ఇచ్చిన అడ్రస్ దగ్గరికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది. దానివల్ల ఒకరోజు పని వృధా అవుతుంది. డబ్బులు ఖర్చు అవుతాయి. వచ్చిన పెన్షన్ డబ్బుల్లో సగం వాటికే వెళ్తున్నాయి. అయితే అలాంటి వారి కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. అయితే… ఎక్కడైతే పెన్షన్ పొందాలనుకుంటే… అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం… సచివాలయ అధికారులను కలవాలని… పెన్షన్ నెంబర్ వాళ్లకు జత చేయాలని… ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా అధికారులను… సంప్రదించాలని కూడా తెలిపింది. కాగా ఏపీలో వృద్ధాప్య పెన్షన్లు నాలుగువేల రూపాయలు ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news