రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ ట్రైన్లు రద్దు

-

రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు ట్రైన్లు పూర్తిగా రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 3 నుంచి ఈ నెల 10 వరకు ఈ ట్రైన్లను రద్దు చేసింది. విజయవాడ సెక్షన్‌లో భద్రతాపరమైన నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

విశాఖ- లింగంపల్లికి వెళ్లే ట్రైన్‌ను నేటి నుంచి 9 వరకు రద్దు చేశారు. లింగంపల్లి- విశాఖపట్టణం వెళ్లే ట్రైన్ ఈనెల 4 నుంచి 10 వరకు రద్దు చేశారు. రాయగడ వెళ్లే ట్రైన్ ఈనెల 3 నుంచి 9 వరకు రద్దు చేశారు.. రైలు 17244 రాయగడ నుంచి గుంటూరు వెళ్లే రైలును ఈనెల 4నుంచి 10 వరకు రద్దు చేసారు. విజయవాడ -విశాఖపట్టణం రైలు అనకాపల్లి వరకు మాత్రమే వెళ్తుంది. విశాఖపట్టణం -విజయవాడ వెళ్లాల్సిన ట్రైన్ అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈవిధంగా ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకూ కొనసాగిస్తారు. తిరుపతి -విశాఖపట్టణం వెళ్లాల్సిన రైలు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు సామర్లకోట వరకూ మాత్రమే వెళ్తుంది.

విశాఖపట్నం -తిరుపతి వెళ్లే ట్రైన్ ఈనెల 7 నుంచి 9 వరకు సామర్లకోట నుంచి బయలుదేరుతుంది. విశాఖపట్టణం, సామర్లకోట మధ్యలో ఈ రైలు నడవదని రైల్వే అధికారులు వెల్లడించారు. మచిలీపట్నం – విశాఖపట్టణం వెళ్లే ట్రైన్ ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖపట్టణం -మచిలీపట్టణం వెళ్లే ట్రైన్ ఈనెల 5 నుంచి 10 వరకు రద్దు చేశారు. అయితే నరసాపురం నుంచి రాత్రి 11 గంటలకు భీమవరం వెళ్లే విశాఖ లింకు ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా నడుస్తుందన్నారు. నరసాపురం -గుంటూరు వెళ్లే ఫాస్ట్‌ ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం నుంచి 10వ తేదీ వరకు రామవరప్పాడు వరకే నడుస్తుందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news