జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే మూడు పార్టీలతో పొత్తు : జ్యోతుల నవీన్

-

2024 ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మక మైందని టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా స్వాగతిస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు పొత్తు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.వైసీపీ నిరంకుశ పాలనను తుదముట్టించేందుకు మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని విమర్శించారు. అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయని ఆరోపించారు.

వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిగా మారిందన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో వైఎస్సార్ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాటల్లోనే విన్నామని, బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిందని మొన్న జరిగిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైంది. ఇంత అరాచక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news