ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు కేవలం బుచ్చయ్య చౌదరికి మాత్రమే ఉందన్నారు అంబటి రాంబాబు. ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లును తీసుకొచ్చింది వైసీపీ సర్కార్. ఇక ఈ ఇష్యూ పై అంబటి రాంబాబు మాట్లాడారు. టీడీపీ సభ్యులకు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించే హక్కు లేదు…బుచ్చయ్య చౌదరి ఒక్కరికే ఎన్టీఆర్ పేరు ప్రస్తావించే హక్కు ఉందని వెల్లడించారు.
చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు ఇక్కడ ఉన్న సభ్యుల్లో బుచ్చయ్యచౌదరి ఒక్కరే ఎన్టీఆర్ పక్షాన నిలబడ్డారన్నారు. మిగిలిన వాళ్ళంతా వెన్నుపోటు దారులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలని అడుక్కున్న వ్యక్తి చంద్రబాబు అని…కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేసిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నీకు గతంలో ఎందుకు చేయలేకపోయావ్… చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలో మార్పు రావాలని ఆ దేవుడిని కోరుతున్నా…వైఎస్ జగన్ మీద బురద జల్లడం మానుకోవాలన్నారు.