NTRకు వెనుపోటు పొడిచినట్లే…పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడని మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం..ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామం లో సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు…అనంతరం మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ను అధికారం నుంచి దించుతాను అని పదే పదే చంద్రబాబు అంటున్నాడని..14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసి ఒక్క పథకం ప్రవేశ పెట్టలేదని ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.
రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తెచ్చారు….24 సీట్ల కు కక్కుర్తి పడి చంద్రబాబు పల్లకి మోస్తున్నాడని పవన్ కళ్యాణ్ పై సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి రాంబాబు. జనసైనికులు పవన్ కళ్యాణ్ ను సీఎం అనుకున్నారు..కాపులు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా లేరన్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలీదు…ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 175కి 175 పవన్, చంద్రబాబు లోకేష్ ఓడిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. రెండు లక్షల అరవై వేల కోట్లతో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాము…పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం రేపు జరగబోయే ఎన్నికలు అని తెలిపారు.