రామోజీరావు వైట్ కాలర్ నేరగాడు : అంబటి

-

చంద్రబాబు చేతిలోని పత్రికల వలన జనానికి వాస్తవాలు తెలియటం లేదు. అందుకే వైఎస్ఆర్ సాక్షి పత్రికను ప్రారంభించారు. కానీ ఆరోజు నుండి సాక్షి మీద విషం కక్కుతూనే ఉన్నారు అని అంబటి రాంబాబు ఆరోపించారు. సాక్షి మీద, భారతి మీద విషప్రచారం చేస్తే సహించేది లేదు. సాక్షి పత్రిక దేశంలోనే టాప్ పొజిషన్ లో ఉన్న వాటిల్లో ఒకటి. ఈనాడు ఎప్పుడూ మాపై విషం కక్కుతూనే ఉంటుంది. అయినా సరే ఆ పత్రికకు ప్రకటనలు ఆపలేదు.

మా ప్రభుత్వ హయాంలో ఇచ్చే ప్రకటనలను ఈనాడు సంవత్సరంన్నర పాటు వేయలేదు. సంవత్సరానికి ఈనాడుకి అరవై కోట్లు ఇస్తే, సాక్షికి ఇచ్చింది కేవలం యాభై కోట్లే. రామోజీరావు చనిపోతే ప్రభుత్వం రూ.4కోట్లపైనే ఖర్చు చేసి సంతాప సభ ఏర్పాటు చేయటం ఏంటి అని ప్రశ్నించిన అంబటి.. రామోజీరావు వైట్ కాలర్ నేరగాడు. చిట్ ఫండ్ కంపెనీ పేరుతో జనాన్ని మోసం చేశారు అని పేర్కొన్నారు. ఇక అలాంటి వ్యక్తికి ప్రభుత్వం తరపున కోట్లు ఖర్చు చేసి సంతాప సభలు పెట్ఠం ఏంటి.. చంద్రబాబు ఈమధ్య బాగా ప్రెస్టేషన్ కి గురవుతున్నారు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు అని అంబటి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version