చంద్రబాబు దొంగ అయినా పవన్ అంగీకరించడు : అంబటి రాంబాబు

-

 చంద్రబాబు నాయుడు సానుభూతి రాజకీయాలు చేసే  ప్రయత్నం చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అలాంటి సానుభూతి రాజకీయాలు ఇప్పుడు చెల్లవని చెప్పారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు. చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడటం తప్పదని అన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే వదిలిపెడతారని చెప్పారు.  

చంద్రబాబు దొంగ అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒప్పుకోడని.. హీరో అనే అంటాడని సెటైర్లు వేశారు. అందుకు వారిద్దరి మధ్య ఉన్న బంధం అలాంటిదని విమర్శించారు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్న పవన్ కళ్యాణ్ నోరు విప్పరని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌.. పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసుడు, దత్త రాక్షసులని విమర్శలు గుప్పించారు. 

డెల్టాలో వరి నాట్లకు ఇబ్బంది లేదని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అవసరమైతే వారా బంది నిర్వహిస్తామని తెలిపారు. శ్రీశైలం, నాగర్జున సాగర్, పులిచింత ప్రాజెక్టులలో పూర్తిస్థాయి నీరు లేదని చెప్పారు. సాధారణం కంటే మైనస్ 31 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. నాగార్జున సాగరల్‌లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. సాగర్ ఆయకట్టు రైతులు వరి పంట వేయద్దని  సూచించారు. రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని కోరారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. 

Read more RELATED
Recommended to you

Latest news