టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైంది. యాత్రకు ముందు కుప్పంలోని వరదరాజ స్వామి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం నుంచి లోకేశ్ వెంట హిందూపురం MLA బాలకృష్ణ, భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో నడిచారు.
400 రోజుల పాటు 4,000KM మేర శ్రీకాకుళం వరకు యాత్ర సాగనుంది. అయితే, నారా లోకేష్ పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సైటైర్లు పేల్చారు. ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు !… గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు..పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడంటూ లోకేష్ ను ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.