ఏపీ బీజేపీ చీఫ్: కన్నాను తొలగించడం కన్ ఫాం… కొత్త పేరూ కన్ ఫం!

-

అదృష్టం అన్నిసార్లూ తలుపుతట్టదు.. అన్నిసార్లు ఒంటికి పట్టదు.. అది తట్టినప్పుడే తలుపు తీయాలి.. అది ఒంటికి పట్టినప్పుడే దాన్ని శాస్వతం చేసుకోవాలి! ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తలుపైతే తీసారు కానీ.. దాన్ని నిలబెట్టుకునే విషయంలో వెనకబడిపోయారు. దానికి కారణం కొన్ని విషయాల్లో ఆయన అత్యుత్సాహం కారణమైతే.. మరికొన్ని విషయాల్లో “శభాష్ కన్నా” అని బాబుతో అనిపించుకోవాలనే ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు!

వివరాల్లోకి వస్తే… త్వరలో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి కన్నా లక్ష్మీనారాయణను తప్పించొచ్చనే కథనాలు స్టార్ అయ్యాయి. నిప్పు లేకుండా పొగ రాదుకాబట్టి… హస్తిన కేంద్రంగా ఆ సంకేతలు వస్తున్నాయని.. కన్నా పద్దతి నచ్చని వారు ఇప్పటికే కేంద్రంలో ఫిర్యాదులు చేశారని చెబుతున్నారు. ఇంతకూ కన్నా లక్షమీనారాయణ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఏపీ బీజేపీకి చేసిందేమిటి?

బలమైన కాపుసామాజిక వర్గం వారికి పార్టీ అద్యక్ష బాధ్యతలు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకున్న అనంతరం కన్నాకు ఆ ఛాన్స్ దక్కింది. మొదట్లో సోము వీర్రాజు కి అవకాశం రావొచ్చని అంతా భావించినా… ఏపీలో ఉన్న ఒక బలమైన అదృశ్య శక్తి నాడు “వారికీ వారికీ” ఉన్న సంబంధం వల్ల రికమండేషన్ చేశారని అంటుంటారు! ఆ కృతజ్ఞతతోనే పార్టీ కంటే ఎక్కువగా ఆ అదృశ్య శక్తికే కన్నా ఎక్కువగా పనిచేస్తుంటారని.. దాని ఫలితమే ఈ పరిస్థితిని అని అంటున్నారు!

ఇందులో భాగంగా.. ఏపిలో బీజేపీ బలపడటానికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కన్నా పార్టీకి చేసిన సేవేమీ లేదు! కనీసం తన సామాజిక వర్గాన్ని ఒకతాటిపైకి తీసుకురావడం సంగతి దేవుడెరుగు.. కనీసం ఆ ప్రయత్నం కూడా చేసిన దాఖలాలు లేవు! పార్టీ తరుపున ఇప్పటివరకూ మైకుల ముందుకో, ఛానల్స్ ముందుకో వచ్చి కాస్త గట్టిగా మాట్లాడింది లేదు.. పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపించిందే లేదు! మరి ఇంకెందుకు?

ఇటు గ్రౌండ్ లెవెల్ లోనూ పార్టీని పటిష్టం చేయక… ఆఖరికి మీడియాలోనూ పార్టీ వాయిస్ ని బలంగా వినిపించక… పదవి నిచ్చిన పార్టీ కంటే ఎక్కువగా రికమండేషన్ చేసిన వారి క్షేమం కోరే అధికంగా పనిచేయడం వల్ల… కన్నాను త్వరలో తీసేస్తారని, అందుకోసం ఏపీకే చెంది హస్తిన లో రింగు తిప్పుతున్న ఒక పెద్దాయన చక్రం తిప్పుతున్నారని అంటున్నారు!

ఈ క్రమంలో వీలైనంత త్వరలో కన్నాను తప్పించి… విష్ణువ‌ర్థన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించొచ్చని అంటున్నారు! బ‌ల‌మైన గ‌ళంతో ప్రత్యర్థుల‌పై విరుచుకుప‌డుతుండటమే కానీ.. పార్టీ నేత‌ల‌ను కూడా క‌లుపుకొని పోయే పద్దతిలో కానీ.. కేంద్రంలోని పెద్దల క‌నుస‌న్నల్లో క‌లిసి ప‌నిచేసే విధానంలో కానీ… విష్ణువర్ధన్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నారని.. ప్రస్తుతం ఆయనైతేనే సరైన వ్యక్తి అని వారు భావిస్తున్నారంట! ఈ లెక్కన పదవి నుంచి తీసేస్తే… కన్నా బీజేపీలోనే కొనసాగుతారా.. లేక రహస్య బంధాన్ని బహిరంగ పరిచేస్తారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news