ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఇప్పటికే విద్యలో 5%, ఉద్యోగ నియామకాలు, పదోన్నతులలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి జి విజయలక్ష్మి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పేదరిక నిర్మూలన పథకాలకు మాత్రమే వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఉండేది. ఇకపై అన్ని సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. వ్యవసాయ సాగు భూమి కేటాయింపు, గృహ నిర్మాణం, ఉపాధి, వ్యాపారం, ఎంటర్ప్రైజెస్, రిక్రియేషన్ సెంటర్స్, ప్రొడక్షన్ సెంటర్ తదితర ప్రోత్సాహకాలకు సైతం ఐదు శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.