ఏపీలో జూలై 6 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL)

-

ఏపీలో జూలై 6వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ తరహాలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తెరమీదికి వచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ మెగా క్రికెట్ ఈవెంట్ ను నిర్వహించబడుతుంది. ఈ లీగ్ టోర్నమెంట్ లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. ఫ్రాంచైజీల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బిడ్డింగ్స్ ను ఇదివరకే ఆహ్వానించింది. మొత్తం 27 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో తొమ్మిదింటిని షార్ట్ లిస్ట్ చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్( ఏసీఏ).

చివరికి ఆరు ప్రాంచైజీలను ఎంపిక చేసింది. రాయలసీమ కింగ్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్.. పేర్లతో ప్రాంఛైజీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో ఫ్రాంచైజీ లో మొత్తం 20 మంది ప్లేయర్లు ఉంటారు. ఒక్కో ఫ్రాంచైజీలో హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ ఫిజియో తో పాటు మరో నలుగురు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఈ ఆరు ఫ్రాంఛైజీలను వేరు వేరు రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ఏర్పాటు చేశారు. మ్యాచ్లన్నింటిని విశాఖపట్నం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలోనే షెడ్యూల్ అయ్యాయి. జూలై 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. జూలై 17వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news