లాక్ డౌన్ సమయంలో బయటకు రావొద్దు అని ఎవరికి చెప్పినా సరే కనీసం లెక్క చేసే ప్రయత్నం చేయడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుంది. రావొద్దు కరోనా వస్తుంది అనే హెచ్చరికలు చేసినా సరే ఎవరూ కూడా లెక్క చేయకపోవడ౦ ఏపీ పోలీసులు కొత్త ప్లాన్ వేసారు. ఇప్పటి వరకు బయటకు వచ్చే వాళ్ళను రావొద్దు అనే చెప్పిన పోలీసులు… ఇప్పుడు దమ్ముంటే బయటకు రావాలని కోరుతున్నారు.
వస్తే మాత్రం పోలీసు జీపు లో కాదు నేరుగా అంబులెన్స్ లోనే ఎక్కించాలి అని నిర్ణయానికి వచ్చేశారు. ఎవరు బయటకు వచ్చినా సరే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే అని స్పష్టంగా చెప్తున్నారు, బయటకు వస్తే ఇంటికి వెళ్ళడానికి 14 రోజులు కచ్చితంగా పడుతుంది అని హెచ్చరిస్తున్నారు. కర్నూలు, విజయవాడ, గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు విజయవాడ, కర్నూలు, నెల్లూరు లాంటి చోట్ల ఈ సమస్య ఎక్కువగా ఉందని, అనవసరంగా బయటికి వచ్చిన వారిని అంబులెన్స్‌లో క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తే ఫలితం ఉండొచ్చని డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం కృష్ణలంక, మాచవరంలో పోలీసులు ఉదయం పది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రతి ఒక్కరినీ బండి ఆపి చెక్ చేసి, సరైన కారణం లేకపోతే క్వారంటైన్ కి తరలించారు.