14 రాష్ట్రాలు.. 6200 కి.మీ.. రాహుల్ ‘భారత్ న్యాయ్ యాత్ర’ షెడ్యూల్ ఇదే

-

దేశంలో బీజేపీ సర్కార్ను గద్దె దించాలనే లక్ష్యంతో.. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. మరో రెండు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మరోసారి యాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి భారత్ న్యాయ యాత్ర పేరుతో ఈ యాత్రను చేయనున్నారు. దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు ఈ యాత్ర కొనసాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. మణిపుర్‌ నుంచి ముంబయి వరకు మొత్తం 6,200 కి.మీ మేర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలతో ఆయన ముచ్చటించనున్నట్లు వెల్లడించారు.

రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర వివరాలు ఇవే..

14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో 6200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర

వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు సాగనున్న యాత్ర

పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈ సారి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు రాహుల్ గాంధీ

మణిపుర్‌ నుంచి మొదలయ్యే ఈ న్యాయ యాత్ర నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news