గోదావరిలో వైసీపీకి ఒక్క సీటు రాదు..పవన్ సవాల్ గెలుస్తారా?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహి యాత్రతో దూసుకెళుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. భారీ ఎత్తున పవన్ యాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఇక పవన్ యాత్ర చేస్తూ…వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమంటూ ప్రచారం చేస్తూ వెళుతున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ జగన్‌ని అధికారంలో నుంచి దించుతానని సవాల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వనని తాజాగా రాజోలు సభలో పవన్ సవాల్ చేశారు. గోదావరి జిల్లాలని నాశనం చేసిన వైసీపీని ఓడించడమే తన లక్ష్యమని అంటున్నారు. అయితే పవన్ అనుకున్న సవాల్ నెరవేరుతుందా? గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదా? అంటే అలాంటి పరిస్తితి పెద్దగా లేదనే చెప్పాలి. కాకపోతే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి గట్టిగానే డ్యామేజ్ జరుగుతుంది గాని..మరి ఒక్క సీటు రాకుండా ఓడించడం కష్టమే.

2014 ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పి పొత్తుకు జనసేన సపోర్ట్ ఇవ్వడం వల్ల..ఉమ్మడి తూర్పు గోదావరిలో 19 సీట్లు ఉంటే 14 సీట్లు గెలుచుకోగా, వైసీపీకి 5 సీట్లు వచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరికి 15కి 15 సీట్లు గెలుచుకున్నారు. 2019లో పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి తూర్పులో వైసీపీకి 14, పశ్చిమలో 13 సీట్లు వచ్చాయి.

అయితే ఇప్పుడు టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటే రెండు జిల్లాల్లో వైసీపీకి నష్టం జరుగుతుంది. కాకపోతే ఒక్క సీటు కూడా రాకుండా ఉండదు. తూర్పులో టి‌డి‌పి, జనసేన పొత్తు ఉన్నా సరే వైసీపీ 5 సీట్లు పైనే గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇటు పశ్చిమలో నాలుగు సీట్లు వరకు గెలుచుకోవచ్చు. కాబట్టి పవన్ సవాల్ గెలవడం కష్టమే.

 

Read more RELATED
Recommended to you

Latest news