భీమ్లా నాయక్ కాదు..బిచ్చం నాయక్ అంటూ మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగరంలోని రాజన్న భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల తర్వాత బి.సి.మంత్రి గా అవకాశం కల్పించారు.. అప్పుడే చెప్పారు ..రెండున్నర ఏళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకోవాలని చెప్పారన్నారు. జగన్ కు సైనికుడుగా పని చేస్తానని .. మూడేళ్లు గొప్ప శాఖను నాకు ఇచ్చారు.. దానికి తగినట్లుగా పని చేశామని తెలిపారు.
గౌతమ్ తో కలిసి పొరపొచ్చాలు లేకుండా పనిచేసామని.. మంత్రిగా వున్నపుడు ప్రజలను కలుసుకోలేకపోయానని పేర్కొన్నారు. ఈ రెండేళ్లు ప్రజలకు మరింత చేరువ అవుతానని.. ఏదయినా నేరుగానే తలపడతానని స్పష్టం చేశారు. ఈ రోజు మాజీలైన మంత్రులు మరింత డబుల్ ఫోర్స్ తో వెళతామని.. వచ్చే ఎన్నికల్లో వై.సి.పి.ని గెలిపించడమే మా ద్యేయమన్నారు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను మెయిన్ హీరో అని చెప్పుకుంటున్నారు.. 30 లేదా 40 సీట్లకు పోటీ చేస్తారని.. 140 సీట్లకు పోటీ చేస్తే అప్పుడు మాట్లాడుతానని చురకలు అంటించారు. యనమల లాంటి వాళ్ళు అర్థం చేసుకోక మాట్లాడుతున్నారు.. ఆయన బి.సి.గానే అవకాశాలు పొందారన్నారు.జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే తీసుకుంటా.. జగన్ ఏమిచ్చినా బాధ్యత నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.