కొడాలి నాని, నా పేరు లేక పోతే కొన్ని ఛానల్స్ కు న్యూస్ ఉండదు – మాజీ మంత్రి అనిల్

-

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. కొడాలి నాని, నా పేరు లేక పోతే కొన్ని ఛానల్స్ కు న్యూస్ ఉండదంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం పై నేను కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తా. , రాయించ గలుగుతా..నని స్పష్టం చేశారు. కానీ ..అంత నీచంగా దిగజారి రాజకీయం చేయడం మాకు చేతకాదని విమర్శలు చేశారు. కొడాలి నాని, నా పేరు లేక పోతే కొన్ని ఛానల్స్ కు న్యూస్ ఉండదని ఫైర్‌ అయ్యారు. 2024 ఎవరు గెలుస్తారో చూసుకుందాం..చిల్లర రాజకీయాలు మానండని కోరారు. అమావాస్యకు ఒకసారి తిరిగే వాళ్ళు కూడా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు చేశారు. చెత్త పన్నును చంద్రబాబే ప్రతిపాదించారన్నారు మాజీ మంత్రి అనిల్‌. దాన్ని ఇంకా తగ్గించే యోచన చేస్తున్నామని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news