3 వారాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం – మంత్రి నారాయణ

-

3 వారాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు ఏపీ మంత్రి నారాయణ. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు అందిస్తామని వెల్లడించారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని.. వీటిల్లో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందని వివరించారు. పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని ప్రకటించారు ఏపీ మంత్రి నారాయణ.

In Pics Nandamuri Balakrishna relaunches Anna canteen in Hindupur

అమరావతిలో ఇవాళ పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతల స్వీకరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ…. పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. సచివాలయం, అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు ఏపీ మంత్రి నారాయణ. ప్రపంచ టాప్‌-5 రాజధానుల్లో అమరావతి ఉండాలని చంద్రబాబు లక్ష్యమని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news