వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. వల్లభనేని వంశీ పై మరో కేసు నమోదు అయింది. నకిలీ పట్టాల కేసులో వల్లభనేని వంశీ పై పీటీ వారెంట్ నమోదు ఐంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 19లోగా నూజివీడు సెకండ్ అడిషనల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచాలని గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

2019లో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంశీ బాపులపాడు మండలంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి నకిలీ పట్టాలు ఇచ్చారనే అభియోగంతో ఆయనపై కేసు నమోదు అయింది. కేసు విచారణ నిమిత్తం వంశీని కస్టడీ కోరుతూ బాపులపాడు పోలీసులు గురువారం నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దింతో వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది.