మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరో కేసు

-

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరో కేసు నమోదయింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టులోకి తీసుకెళ్లే సమయంలో పిన్నెల్లికి ఎదురువచ్చాడు టీడీపీ కార్యకర్త కొమెర శివ. ఈ సమయంలో పిన్నెల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. కానీ అంతులోనే.. కొమెర శివను కడుపులో గుద్దారు పిన్బెల్లి రామకృష్ణారెడ్డి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో.. పరిస్థితి సద్దుమణిగింది.

అయితే.. ఈ తరుణంలోనే.. తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివ పై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాడి చేసిన అంశంపై ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనం దిగి వైసిపి కార్యకర్తలతో కరచాలనం చేస్తుండగా, అదే సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి శివ కూడా ఎదురుపడ్డాడు. దీంతో మాజీ ఎమ్మెల్యే పిడికిలి బిగించి శివ కడుపుపై గుద్దడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news