ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ మొదలు అవుతున్నాయి. విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు గుర్తించారు. ఇక తాజాగా కడపలో కరోనా కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఓ వ్యక్తి కడప రిమ్స్ ఆసుపత్రిలో చేరాడు.

covid
Another Corona positive case in AP

అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కాగా, కరోనా బాధితుడు నంద్యాల జిల్లా వాసి అని తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్లీ ప్రబలుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news