ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ పలు విషయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు శాఖలో ప్రక్షాళనలు చేపట్టిన విషయం విధితమే. ఇందులో భాగంగానే పలు వ్యవస్థల్లో మార్పులు చేర్పులు చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ విషయాల్లో కూడా సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కొత్త వైద్య కాలేజీల కు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ కళాశాల యొక్క పేర్లను ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఐదు వైద్య కళాశాలల పేర్లను తొలగించారు. తాజాగా మచిలీపట్నం వైద్య కాలేజీ పేరును ప్రభుత్వం మార్చింది. పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.