జనసేన పార్టీకి మరో కీలక పదవి రానుందని సమాచారం. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. జనసేనలో ఆ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై టీడీపీ, జనసేన కసరత్తు కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ చీఫ్ విప్ గా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేరును చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అటు అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు ఖరారు అయిందా…? ఖరారు అయినట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.