తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా..!

-

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ వేడుకల నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించి.. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్‌ సర్కారు కసరత్తు ప్రారంభించింది. యూపీఏ చైర్‌ పర్సన్‌ హోదాలో అన్ని వర్గాలనూ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీకి ప్రభుత్వ పరంగా ఉత్సవ వేదికపై సన్మానం జరగనుంది.

తెలంగాణ రాష్ట్ర గేయం ‘జయజయహే తెలంగాణ’ను ఇదే వేదిక ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసినవారి కుటుంబాలకు సన్మానం, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇచ్చే అంశాలపైనా పరిశీలన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాలను ఆహ్వానించి వారి సమక్షంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా.. కొత్త లోగోపై సంప్రదింపులు జరుగుతుండటంతో వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news