ఏపీలో మరో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో ఓ బాలికపై ముగ్గురు స్కూల్ విద్యార్థులు లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం సాటి తల్లితండ్రులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇటీవల జరిగిన విషయంలో నేటికి బాలిక మృతదేహాన్ని పోలీసులు కనుక్కోలేకపోయారు. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.
తాజాగా ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణఘటన వెలుగుచూసింది. కోవెలకుంట్లలో మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పాడ్డారు. ఈ నెల 24న ఆమెకు మాయమాటలు చెప్పి పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లిన యువకులు లైంగికదాడి చేస్తూనే వీడియోలు తీసినట్లు సమాచారం.
అలా ఆ వీడియోలు, ఫొటోలను ఇతరులకు షేర్ చేస్తూ వారు రాక్షస ఆనందం పొందినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వీడియో ఒకటి బయటకు లీక్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.