ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కాసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీలో లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన తిరువల్లువార్ కవితను బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.2022 -23 ఏపీ వార్షిక బడ్జెట్ ను రూ. 256256 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు.
ఇక ఇందులో రెవెన్యూ వ్యయం రూ.208261 కోట్లు అని, మూలధనం వ్యయం రూ.47,996 కోట్లు అని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన. ఇక రెవెన్యూ లోటు రూ. 17036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు రూ. 48724 కోట్లుగా ఉందని మంత్రి అసెంబ్లీ లో ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య లక్ష్యం నవరత్నాలు అలాగే సంక్షేమం అని ప్రకటన చేశారు. కరోనా విపత్తులు ఎదుర్కొనే టప్పుడు మన సామర్థ్యం తెలుస్తుందని వివరించారు.
ఈ ఏడాది వార్షిక బడ్జెట్ వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధికంగా కేటాయింపులు చేశామని ఆయన వివరించారు. ముఖ్యంగా నవరత్నాల పథకాలకు ప్రాధాన్యత కలిగించమని… సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ ను రూపొందించామని స్పష్టం చేశారు.