ముగిసిన ఏపీ క్యాబినెట్.. తీసుకున్న కీలక నిర్ణయాలివే !

సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మూడున్నర గంటలపాటు సాగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. ఈ సమావేశంలో బందరు పోర్టు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న కెబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ప్రైవేటు సంస్థకు అప్పగించాల్సిన పక్షంలో ఓపెన్ టెండర్ ద్వారా ప్రక్రియ చేపట్టాలన్న మంత్రి వర్గం ఉప సంఘం సూచనలు పరిగణలోకి తీసుకుంటూ ఉప సంఘం సిఫార్సులను ఆమోదించింది.

ap cabinet meeting takes key decisions
ap cabinet meeting takes key decisions

అంతే కాక ఎస్ఈబీ బలోపేతంపై చేసి ఎస్ఈబీ పరిధిని విస్తరించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గ్యాబ్లింగ్ సహా వివిధ జూదాల కట్టడి బాధ్యతలను ఎస్ఈబీ పరిధిలోకి తేవాలని ప్రతిపాదనలు రాగా దానికి ఆమోదం తెలిపింది. అలానే అగ్నిమాపక సంస్థ బలోపేతానికి కేబినెట్ ఆమోదం తెలిపి నాలుగు జోన్ల ఏర్పాటుఅ అలానే వివిధ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. నవంబర్ 24న జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే వారికి సున్నా వడ్డీ కింద 10 వేల రూపాయల రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇక, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు-2019లోని 75,76 క్లాజుల రద్దు సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. మ్యారిటైం బోర్డు రుణ సదుపాయం..4745 కోట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.