అమరావతిలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు భూమిపూజ

-

ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో ఇల్లు నిర్మించాలని తలపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నివాసం ఉండవల్లిలో ఉంది. అయితే రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ.. ఈ ప్రాంతానికి సమీపంలో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉండొచ్చని ముఖ్యమంత్రి భావించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేయతలపెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ శంకుస్థాపన చేశారు.

అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల‌గ‌పూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. గత ఏడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి చంద్రబాబు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కాగా తాజాగా శంకుస్థాపన చేశారు. ఈ ఇంటిని 1,455 చ.గజాల విస్తీర్ణంలో జి ప్లస్‌ 1లో నిర్మించాలని ప్లాన్ చేశారు. ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news