సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ కి మాతృ వియోగం

-

టాలీవుడ్ కమెడియన్, నటుడు సప్తగిరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి చిట్టెమ్మ మంగళవారం రోజున బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.  ఇవాళ (బుధవారం) తిరుపతిలోని పద్మావతిపురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో చిట్టెమ్మ అంత్యక్రియలు జరపనున్నాయి. ఈ విషయాన్ని సప్తగిరి కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిని కోల్పోయిన సప్తగిరి సినీ ప్రముఖులు సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇవాళ తిరుపతిలో చిట్టెమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు రానున్నారు.

సప్తగిరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన కామెడీ టైమింగుతో చాలా కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కామెడీతో నవ్వించడమే కాదు.. ఎమోషన్స్ తో ఏడిపించడం కూడా సప్తగిరికి అలవాటే. ఆయన కమెడియన్ గానే కాకుండా సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రాల్లో హీరోగా నటించాడు. తాజాగా ‘పెళ్లి కాని ప్రసాద్’ అంటూ మరో చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇక స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ కానూ రాణిస్తున్నాడు సప్తగిరి.

Read more RELATED
Recommended to you

Latest news