దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఆల్ టైం రికార్డు స్థాయికి చేరి ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. అయితే ఇన్నాళ్లూ పసిడితో పోటీ పడిన వెండి ధర మాత్రం తాజాగా స్వల్పంగా తగ్గింది. మంగళవారం రోజున రూ.90,530 ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. బుధవారం నాటికి రూ.830 పెరిగి రూ.91,360 వద్ద పలుకుతోంది. ఇక కిలో వెండి ధర మంగళవారం రోజున రూ.92,120 ఉండగా, బుధవారం నాటికి రూ.182 తగ్గి రూ.91,938కు చేరుకుంది.
మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు వెండి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల పసిడి రేటు రూ.91,360గా ఉండగా.. కిలో వెండి ధర రూ.91,938 వద్ద పలుకుతోంది. మరోవైపు ఏపీలోని విజయవాడలోనూ పుత్తడి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. నగరంలో తులం గోల్డ్ రేటు రూ.91,360 వద్ద పలుకుతుండగా.. కిలో వెండి ధర రూ.91,938గా ఉంది.