చిక్ బల్లాపూర్ రోడ్డు ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్!

-

ఈ రోజు ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బల్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు ట్యాంకర్ గుద్దుకున్న ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది అక్కడికక్కడే మరణించగా, ఒక్క వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో ఉన్నాడు. విషాదకరమైన విషయం ఏమిటంటే… చనిపోయిన వారు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు చెందినవారే కావడం చాలా బాధాకరం. తాజాగా ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన వారు మరణించడం నన్ను చాలా కలచివేసిందన్నారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను అంటూ బాధపడ్డారు సీఎం జగన్. మరణించిన బాధిత కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి పరిస్థితి చాలా విషమంగా ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేద్దామన్నారు సీఎం జగన్. ఇక మరణించిన వారి గ్రామాలల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news