ఇంటింటికీ ఆరోగ్య రక్ష కు జగన్ సర్కార్ సన్నాద్ధం అయింది. రేపట్నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టనుంది ఏపీ సర్కార్. జగనన్న సురక్ష తరహాలోనే ప్రజల కోసం మరో కార్యక్రమం చేపట్టనుంది. పౌరుల ఆరోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ ముందుకు వెళుతోంది. అనారోగ్య బాధితులను చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థకు నాంది.. 5 దశల్లో కార్యక్రమం.. ఉచితంగా 7 రకాల పరీక్షలు నిర్వహించనుంది ఏపీ సర్కార్.
15 నుంచి వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధుల క్యాంపెయిన్ చేయనున్నారు అధికారులు. ఈ నెల 30 నుంచి నలుగురేసి డాక్టర్లతో హెల్త్ క్యాంప్లు లు నిరావహించనున్నారు. వీరిలో ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు కూడా..ఉంటారు. 45 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి ఇల్లూ కవర్ చేయాలని.. కార్యక్రమం అమలుపై కలెక్టర్లకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనుంది ఏపీ సర్కార్. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.