BREAKING : వైఎస్సార్‌ కాపు నేస్త పథకం నిధులు విడుదల

-

BREAKING : వైఎస్సార్‌ కాపు నేస్త పథకం నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… 3,38,792 మంది లబ్దిదారులు ఖాతాలు లో 508 కోట్లు జమ అయ్యాయన్నారు. మనది అక్కచెల్లెళ్ళు, రైతులు, పేదలు ప్రభుత్వమని… మేనిపెస్టో లో చెప్పకపోయిన మీకు తోడుగా ఉండాలని ఈ పధకం తీసుకు వచ్చామని వెల్లడించారు.

మూడేళ్ళ లో కాపు నేస్తం పథకానికి 1492 కోట్లు అందించాము.. మూడేళ్ళలో కాపు సామాజిక వర్గానికి 16256 కోట్లు లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు పధకం ద్వారా ద్వారా 2,46,080 కాపు మహిళలు కి12 వేలు కోట్లు లబ్ది చేకూరుందని.. ఈ మూడేళ్ళ లో కాపు కుటుంబాలు కి జరిగిన లబ్ది 32 వేలు కోట్లు అని వెల్లడించారు సీఎం జగన్‌. చంద్రబాబు హయాంలో డీ పీ టీ అంటే దోచుకో, పంచుకో తినుకో అని ఉండేదని విమర్శలు చేశారు. చంద్ర బాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు కలిసి దోచుకుని పంచుకుని తిన్నారు.. చంద్రబాబు దుష్ట చతుష్టయం ద్వారా రాష్ట్రము శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news