ఏపీ కరోనా అప్డేట్ : 3746 కేసులు, 27 మరణాలు

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. నిన్న కాస్త తగ్గిన కరోన కేసులు ఈ రోజు నిన్నటి కంటే మళ్ళీ పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3746 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,93,299 కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 27 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6508కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,396 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 754415 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 74,422 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 72,71,050 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 301, చిత్తూరులో 437, తూర్పు గోదావరిలో 677, గుంటూరులో 396, కడపలో 166, కృష్ణాజిల్లాలో 503, కర్నూల్ లో 65, నెల్లూరులో 116, ప్రకాశం జిల్లాలో 127, శ్రీకాకుళంఓ 167, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 134, పశ్చిమ గోదావరి జిల్లాలో 519 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news