అలా ఎప్పుడూ తెలంగాణకు నిధులు ఇవ్వలేదు : కిషన్ రెడ్డి

-

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అతి భారీ వర్షం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ధ్వంసం కావడంతో పాటు రహదారులు కూడా ధ్వంసమై ఎంతో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికికూడా వరదల నుంచి కోలుకోలేక పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తక్షణ సహాయం కింద 550 కోట్లు మంజూరు చేయగా కేంద్రం కూడా సహాయం చేయాలి అంటూ కోరింది.

అయితే వరద సాయంపై ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేంద్ర సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ విషయంపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి… రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు పర్యటిస్తారని అనంతరం వారు ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నిధులు అందుతాయి అంటూ స్పష్టం చేశారు. అయితే నష్టాన్ని అంచనా వేయకుండా కేంద్రం ఎప్పుడూ నిధులు విడుదల చేయలేదు అంటూ తెలిపారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news