నీట్ ఫలితాలపై ఆగని వివాదాలు..?

-

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి నీటి పరీక్షలు రాశారు. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీట్ ఫలితాల్లో అవకతవకలు జరగడంతో ప్రస్తుతం విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాలు కూడా తెర మీదకు వస్తున్నాయి.

ఇటీవలే మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన వసుంధర అనే విద్యార్థికి నీట్ పరీక్ష ఫలితాలు సున్నా మార్కులు వచ్చినట్లు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి కోర్టులో పిటిషన్ వేసి తన ఓఎంఆర్ షీట్ను చూపించాలి అంటూ పిటిషన్లో పేర్కొంది. అంతే కాకుండా మరో విద్యార్థికి నీట్ పరీక్ష ఫలితాల్లో 212 మార్కులు మాత్రమే వచ్చాయని ఓఎంఆర్ షీట్ సహా ఆన్సర్ షీట్ పూర్తిగా పరిశీలిస్తే తనకు 700 మార్కుల వరకు వస్తాయని ఆరోపించాడు విద్యార్థి.

Read more RELATED
Recommended to you

Latest news