BREAKING: ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు

-

BREAKING: ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలంపై కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు నీరబ్ సర్వీసును పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ తరుణంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థనకు కేంద్రం అంగీకారం తెలిపింది.

Ap CS extended tenure of Nirab Kumar Prasad

ఈ నెలాఖరుకు రిటైర్డ్ కావాల్సి ఉన్న నీరబ్…సర్వీస్ పొడిగింపుతో డిసెంబర్ నెలాఖరు వరకు ఏపీ సీఎస్ గా కొనసాగ నున్నారు. ఇక అటు చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు TDP అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు సమాచారం. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news