ఏపీ లోని పెన్షన్ దారులకు శుభవార్త. ఏపీలో గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చాలా మందికి పింఛన్లు రద్దు అయినట్లు భారీగా ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు రద్దు అయిన వారి వివరాలను పరిశీలించి, వాస్తవాలను గుర్తించారు.
దరఖాస్తులు స్వీకరించేందుకు నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇందుకు అక్టోబర్ నెలలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడించారు. దరఖాస్తులు స్వీకరించిన కేవలం 60 రోజుల్లో కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.