ఏపీ పోలీస్ శాఖలో నిధుల కొరత..!

-

విశాఖలో సైబర్ క్రైమ్ , NDPS కేసులు, ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలు.. వాటి కేసులు, దర్యాప్తుపై సమీక్షించాం అని DGP ద్వారకా తిరుమల రావు అన్నారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. గంజాయి నియంత్రణ పై కేబినెట్ సబ్ కమిటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు పై సమీక్షిస్తోంది.. ANTF కోసం టాస్క్ ఫోర్స్ అమలులోకి వచ్చిన తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తాం. సాగు దశలోనే గంజా యి కట్టడికి చర్యలు చేపట్టాం.

సైబర్ నేరగాళ్లు ప్రలోభాలకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. కాబట్టి గోల్డెన్ అవర్ లో బాధితులు పోలీసులకు సమాచారం ఇస్తే బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసి నష్టపోకుండా చూడటం సాధ్యం అవుతుంది. ప్రతీ జిల్లాలోనూ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏర్పాటు కు సన్నాహాలు జరుగుతున్నాయి. సబ్ డివిజన్ పరిధిలోనూ ప్రత్యేక సైబర్ క్రైం టీమ్ ఏర్పాటు చేస్తాం. అయితే పోలీసు శాఖలో నిధుల కొరత కారణంగా కొన్ని కీలక విభాగాలు మూలన పడ్డాయి. ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరాల AMC లకు నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ గత మూడేళ్లలో విడుదల కాలేదు. దాని కారణంగా సమస్యలు ఎదురయ్యాయి. పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తూ ముఖ్యమంత్రి ఇటీవల చొరవ తీసుకున్నారు అని DGP ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news